మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూర్ ఏప్రిల్ 4 :
తిమ్మాపూర్ లో ఘనంగా గుడ్ ఫ్రైడే
మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూర్ ఏప్రిల్ 4 :
మానవాళి పాపాల పరిహారం కోసం ఏసుక్రీస్తు తన ప్రాణాలను సిలువపై అర్పించిన రోజు సందర్భంగా ప్రపంచంలోనే పలు ప్రార్థన మందిరాలలో ఏప్రిల్ 3 వ తేదీన శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే ను పురస్కరించుకొని తిమ్మాపూర్ జీసస్ మెర్సిపుల్ ప్రార్థన మందిరంలో పాస్టర్ అమ్మ దీవెన ఘనంగా గుడ్ ఫ్రైడే దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ
ఆయన చేసిన అత్యున్నతమైన త్యాగానికి చిహ్నమన్నారు ఏసుక్రీస్తు మరణం ద్వారా మనుషుల పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందని దేవునికి మానవులకి మధ్య సఖ్యత కుదిరిందని క్రైస్తవ సోదరులు నమ్ముతారని పేర్కొన్నారు యూదు పాలకులు, రోమన్ సైనికులు ఏసుక్రీస్తును నిందించి కొరడాలతో కొట్టి చివరికి కలవరి కొండపై సిలువ వేసి చంపిన రోజు సిలువలో మరణించిన రోజు సందర్భంగా క్రైస్తవులు నేడు ఈ దినాన్ని ఒక పండుగ దినముగా జరుపుకుంటారని ఆమె అన్నారు. గుడ్ అంటే దుఖకరమైనదే అయినా ఇది మానవాళికి రక్షణ మార్గం సుగమం చేసిన పవిత్రమైన రోజైనందున దీనిని గుడ్ ఫ్రైడే గా క్రిస్టియన్ సోదరులు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు, బైబిల్ పఠనలు చేపట్టడం జరిగిందని ఆమె పేర్కొన్నారు దీనితోపాటు ఏసుక్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఉపవాస దీక్షలు చేపడుతారని పేర్కొన్నారు దీనితోపాటు క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో సంతాపం వ్యక్తం చేస్తారు. గుడ్ ఫ్రైడే ఏసుక్రీస్తు మరణాన్ని స్మరిస్తూ ఆయన ప్రేమను త్యాగాన్ని గుర్తు చేసుకుని దినమని అన్నారు దీని తరువాత వచ్చే ఆదివారం ను ఏసుక్రీస్తు తిరిగి బ్రతికి మూడవ దినాన పునరుథుడై లేవడాన్ని ఈస్టర్ పండుగగా జరుపుతారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరీ సోదరులు చిన్నలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment