మన ఊరి ముచ్చట పత్రిక నసుర్లాబాద్ ఏప్రిల్ 6 :

 హాజరు కాని శాఖలపై  కలెక్టర్ కు రిపోర్టు వెళ్ళని  ప్రజావాణి కార్యక్రమం.
 స్పందన రాని ప్రజావాణి 
 ఇంకెందుకు ప్రజావాణి
మన ఊరీ ముచ్చట పత్రిక నసుర్లాబాద్ ఏ ప్రేల్ 6: 
నసుర్లాబాద్ మండల కేంద్రంలోగల మండల సమీకృత భవనంలో గల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో  హాజరుకాని శాఖలపై  జిల్లా కలెక్టర్ కు రిపోర్టు వెళ్లకపోవడం పై  పలు విమర్శలు  వెళ్లవెత్తుతున్న అధికారులు నిర్లక్ష్య నీడలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ విధానాల ప్రకారం గైర్వజరు అయిన అధికారుల వివరాలు ఉన్నతాధికారులకు  పంపించాల్సి ఉన్నప్పటికీ  అది అమలు కావడం లేదని  ఆరోపణలు మండల ప్రజలు చేస్తున్నారు.  
ప్రజావాణి నిర్వహణలో  ప్రధాన సమన్వయ  అధికారురాలైన  మండల రెవెన్యూ తాసిల్దార్, సహాయ సమన్వయ అధికారి ఎంపీడీవో స్థాయిలో  సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే  ఈ పరిస్థితి ఏర్పడిందని  స్థానికులు అంటున్నారు.
 హాజరు రిజిస్టర్ ఉన్నప్పటికీ  గైర్వాజరు వివరాలను నమోదు చేసి  ఉన్నత అధికారులకు పంపకపోవడంపై  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని  ఎంతో ప్రాముఖ్యంగా తీసుకొంటున్నా  నేపథ్యంలో  మండల స్థాయిలో  ఇలా నిర్లక్ష్యం జరగడంపై  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  
గైర్వాజరైన  శాఖలపై చర్యలు తీసుకోవాలంటే  ముందు రిపోర్ట్స్  వెళ్లాల్సి ఉండగా అది జరగకపోవడం వల్ల  బాధ్యత ఎవరిపై  అనే ప్రశ్న తలెత్తుతుంది. 
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  జిల్లా స్థాయి అధికారులు  ప్రత్యేక దృష్టి సారించాలని ప్రతి ప్రజావాణి సమావేశం  అనంతరం హాజరు  గైర్వాజరు వివరాలు   తప్పనిసరిగా కలెక్టర్ కు  పంపే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 
దీనిలో భాగంగా రభీ పంట కాలంలో  సాగుచేసిన  వరి ధాన్యం కొనుగోలుకు ఐకెపి ఎపిఎం  మండల వ్యవసాయ అధికారిణి వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ తాసిల్దార్. ఎంపీడీవో, రెవెన్యూ ఇన్స్పెక్టర్,బీర్కూర్ ఎం ఎస్ ఓ.  ఏo పీ ఓ,  మండల విద్యా వనరుల అధికారి మాత్రమే హాజరయ్యారు హాజరుకాని అధికారులపై  ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే  అధికారులు గైర్వజరు అవుతున్నట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు 

Comments

Popular posts from this blog

మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూర్ ఏప్రిల్ 6 :

మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూర్ ఏప్రిల్ 4 :