మన ఊరి ముచ్చట పత్రిక నసు ర్లాబాధ్ ఏప్రిల్ 7 :
గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం
నసుర్లాబాద్ ఎస్. ఐ రాఘవేంద్ర
నసుర్లాబాద్ ఏప్రిల్ 7 :
మండలంలోని మిర్జాపూర్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ 25 డిస్ట్రి బ్యూటర్ కాలువలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సుమారు 60 సంవత్సరాల వయసు గల వృద్ధ మహిళ మృతదేహం నీటిలో తేలుతూ కనిపించినట్లు మండల ఎస్సై రాఘవేంద్ర తెలిపారు
మృతురాలి వయసు సుమారు 60 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. ఆమె కషాయ ఆకుపచ్చ రంగు గల చీర ధరించి ఉండగా తల వెంట్రుకలు నలుపు తెలుపు రంగుల్లో ఉన్నట్లు ఆయన వివరించారు మృదురాలి వివరాలు తెలియ రాలేదని ఎవరైనా గుర్తుపట్టగలిగితే నసుర్లాబాద్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సంప్రదించాలని కోరారు. సంబంధిత సమాచారం కలిగిన వారు ఈ నెంబర్ 87126 86174 ను సంప్రదించాలని కోరారు
Comments
Post a Comment