మన ఊరి ముచ్చట పత్రిక కామారెడ్డి ఏప్రిల్ 10 :
బాన్సువాడ లో అనుమతులు లేని కళాశాల పై చర్యలు తీసుకోవాలి
డి ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు
జీవన్ రాథోడ్
ఏప్రిల్ 10 : బాన్సువాడ మున్సిపల్ పట్టణ శివారులో గల ఠాగూర్ జూనియర్ కళాశాల భవనంలో ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి జూనియర్ కళాశాల పేరుతో అడ్మిషన్లు నిర్వహిస్తున్న విషయంపై చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్ డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలలో బోధన్ పట్టణంలో ఉన్న శ్రీ విజయ సాయి జూనియర్ కళాశాల పేరుతో బాన్సువాడ మున్సిపల్ పట్టణ పరిధిలో రెండవ బ్రాంచ్ ను గతంలో బుడిమి రోడ్డుపై ఉన్న ఠాగూర్ జూనియర్ కళాశాల భవనంలో ఏర్పాటుచేసి అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. అడ్మిషన్ లేకుండా ఈ విధంగా అడ్మిషన్లు చేపట్టి విద్యార్థులు తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు పెద్ద ఎత్తున అడ్మిషన్ లు చేపడుతూ మోసం చేస్తున్నారని అన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి శ్రీ విజయ సాయి కళాశాలపై చర్యలు తీసుకొవలన్నారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కు నివేదించాలని అలాగే జిల్లా నోడల్ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డి ఎస్ ఎఫ్ ఐ డివిజన్ కార్యదర్శినహీం, సహాయ కార్యదర్శి భాను తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment