మన ఊరి ముచ్చట పత్రిక హైదరాబాద్ ఏప్రిల్ 7 :

 కుటుంబ సభ్యుల మధ్యన పోచారం సోనిరెడ్డి  పుట్టినరోజు వేడుకలు
 హైదరాబాద్ ఏప్రిల్ 7  :
 హైదరాబాద్ లో సోమవారం కుటుంబ సభ్యుల మధ్యన  బంజారా హిల్స్ లోని పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో తన చిన్న కోడలు పోచారం సోనిరెడ్డి పుట్టినరోజు  వేడుకలను ఎంతో  ఆనందంగా జరుపుకున్నారు. 
 కుటుంబ సభ్యుల సమక్షంలో పోచారం సోనీ రెడ్డినీ అత్తమామలు  పోచారం శ్రీనివాస్ రెడ్డి పుష్పమ్మ  దంపతులు ఆమెను ఆశీర్వదించారు
 ఈ సందర్భంగా నిజామాబాద్ కామారెడ్డి  ఉమ్మడి జిల్లాల మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన సతీమణి సోనీ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా తన కుమారులు రిషిక్ రెడ్డి, , రుశాంక్ రెడ్ల తో కలిసి  కేకును కట్ చేయించి ఆమెకు  ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.  కుటుంబ సభ్యులంతా కలిసి  సోనీ రెడ్డి కి  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 
 అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో  పోచారం భాస్కర్ రెడ్డి అభిమానులు అనుచరుల ఆధ్వర్యంలో పలు మండలాలలో నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు ఆమె పేరిటతో పలు దేవాలయాలలో వేద పండితుల తో ప్రత్యేక పూజలు అభిషేకాలు  నిర్వహించి కేకులను కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు  

Comments

Popular posts from this blog

మన ఊరి ముచ్చట పత్రిక నసు ర్లాబాధ్ ఏప్రిల్ 7 :

మన ఊరి ముచ్చట పత్రిక

మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూర్ ఏప్రిల్ 6 :