మన ఊరి ముచ్చట పత్రిక బాన్సువాడ ఏప్రిల్ 11 :

 బాన్సువాడలో  సీఎంఆర్ఎఫ్  చెక్కుల పంపిణీ 
         పోచారం శ్రీనివాస్ రెడ్డి 
 ఏప్రిల్   11
 బాన్సువాడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు  బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వ గృహంలో   శుక్రవారం బీర్కూరు మండలానికి చెందిన 17 మందికి  మొత్తం నాలుగు లక్షల  57 వేల రూపాయల  చెక్కులను పంపిణీ చేశారు.
 ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బడుగు బలహీన పేద వర్గాల  ప్రజలను ఎల్లప్పుడూ  ఆదుకుంటూ సహాయ సహకారాలు  అందిస్తున్నారని కొనియాడారు . నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు  సంక్షేమ పథకాలు ముందుండి  తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్కూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దామరంచ గ్రామ సర్పంచ్  బోయిన శంకర్ , బీర్కూర్ నసుర్లాబాద్ ఉమ్మడి మండలాల ఏఎంసి  వైస్ చైర్మన్  యామ పెద్ద రాములు, మేకల విట్టల్ , మాజీ ఎంపీపీ  తీలకేశ్వర  రఘు, బరం ఏడిగి దాబా గంగారం లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మన ఊరి ముచ్చట పత్రిక నసు ర్లాబాధ్ ఏప్రిల్ 7 :

మన ఊరి ముచ్చట పత్రిక

మన ఊరి ముచ్చట పత్రిక నసుర్లాబాద్ ఏప్రిల్ 11 :