మన ఊరి ముచ్చట పత్రిక నసుర్లాబాద్ ఏప్రిల్ 11 :
బొప్పాస్ పల్లి లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం లో పాల్గొన్న జడ్పీ సీఈవో చందర్
ఏప్రిల్ 11 : బోప్పాస్ పల్లి గ్రామంలో కామారెడ్డి జిల్లా జడ్పీ సీఈవో చందర్ మూడు ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామానికి 25 ఇండ్లు మంజూరు అయ్యున్నారు . ఇందిరమ్మ ఇండ్లకు ఆయన ఆధ్వర్యంలో ముగ్గులు పోసి మార్కోడు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 10 ఇల్లు పూర్తయిన సందర్భంగా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు . పూర్తయిన ఇండ్లకు త్వరలోనే బిల్లులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో నసుర్లాబాద్ ఎంపీడీవో రవిశ్వర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అధికార సిబ్బంది గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment