మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూర్ ఏప్రిల్ 12 :

 తిమ్మాపూర్ లో జాతీయ మాతృత్వ సంరక్షణ దినోత్సవం పై గర్భిణీలకు అవగాహన కల్పించిన  
 ఐసిడిఎస్ సూపర్వైజర్                                            శ్రీమతి సుమలత 
 ఏప్రిల్   12  :   గర్భిణీలకు సరైన  ఆరోగ్య సంరక్షణ ప్రసవనంతరం  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  శనివారం బీర్కూరు మండలంలోని  తిమ్మాపూర్ అంగన్వాడి  కేంద్రంలో  స్త్రీ శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్  శ్రీమతి సుమలత   గర్భిణీలకు, బాలింతలకు జాతీయ మాతృత్వ దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  గర్భధారణ సమయంలో  ప్రసవించిన 42 రోజు  లోపు  సంభవించే మరణాన్ని ప్రసూతి మరణం అని అంటారని ఆమె తెలిపారు.  ప్రభుత్వం ప్రతి ఏడాది  మాతృ మరణాల రేటును  తగ్గించి  ఆరోగ్యవంతమైన తల్లులు బిడ్డలను నిర్మించడంలో  కీలక పాత్ర పోషిస్తుందని  ఆమె చెప్పారు  మాతృత్వం మమకారాన్ని కాపాడుకోవడానికి  తగిన జాగ్రత్తలతో  సురక్షితమైన ప్రసూతిని  సాధించడం మాతృత్వ దినోత్సవ  ముఖ్య ఉద్దేశమని అన్నారు.  గర్భధారణ సమయంలో  తల్లులకు తమ అత్తమామలు  సరైన పోషకాహారాన్ని అందించడం, వైద్య సేవలు అందించడం ద్వారా  సురక్షితమైన ప్రసవాలను   ప్రోత్సహించాలని ఆమె సూచించారు.  గర్భం దాల్చిన నాటి నుండి   క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, రక్తహీనత నివారణ చర్యలు తీసుకోవడం, ఆసుపత్రులలో సమయానికి ప్రసవం జరగడం, శిశువుకు అవసరమైన వ్యాక్సిన్లు వేయించడం  వంటి అంశాలపై  గర్భిణీలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు అంగన్వాడి కేంద్రాలలో తప్పనిసరిగా పాలు గుడ్డు   ఆకుకూరలు వంటి పోషక  ఆహారం తీసుకుంటేనే  ఆరోగ్యవంతమైన శిశువు  జన్మిస్తుందని  ఆమె చెప్పారు.
 ఈ కార్యక్రమంలో అంగన్వాడి  టీచర్లు శివరాత్రి నీలావతి, షేవ ఉషారాణి, బీర్పూర్ తాండ  అంగన్వాడీ టీచర్  కవిత, గర్భిణీలు,  బాలింతలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మన ఊరి ముచ్చట పత్రిక నసు ర్లాబాధ్ ఏప్రిల్ 7 :

మన ఊరి ముచ్చట పత్రిక

మన ఊరి ముచ్చట పత్రిక నసుర్లాబాద్ ఏప్రిల్ 11 :