మన ఊరి ముచ్చట పత్రిక ఏప్రిల్ 12

 ఎత్తిపోతల పథకానికి  పంపు మోటార్ల  ట్రయల్ రన్ ప్రారంభోత్సవం చేసిన 
                       పోచారం శ్రీనివాస్ రెడ్డి 
 ఏప్రిల్   12  :  బాన్సువాడ నియోజకవర్గంలో  నిజాంసాగర్ నాన్ కమాండ్  ఏరియాలో పదివేల  ఎకరాలకు సాగునీరు  అందించేందుకు కీలకమైన జాకోర , చందూర్  ఎత్తిపోతల పథకంలో భాగంగా  శనివారం పంపు మోటార్ల  ట్రయల్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు  పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు .
 వర్ని మండలంలో 106 కోట్ల  రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం  ద్వారా రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. పంపు మోటార్ల పనితీరును పరిశీలిస్తూ  ట్రయల్ రన్  విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ పథకం అమల్లోకి వస్తే  నాన్ కమాండ్ ఏరియాలోనీ  రైతులకు సాగునీటి సమస్యలు తగ్గి పంటల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు రైతులు ఆధునిక సాగు పద్ధతులు  అవలంబించి లాభాలు పొందాలని సూచించారు   ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ప్రభుత్వ ఎత్తిపోత పథకాల  సలహాదారులు వెంకటరెడ్డి,  ఇరిగేషన్ సీ. ఈ శ్రీనివాస్, వర్ని జాకోర  చందూర్ ప్రజా ప్రతినిధులు  అధికారులు నాయకులు కార్యకర్తలు  రైతులు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మన ఊరి ముచ్చట పత్రిక నసు ర్లాబాధ్ ఏప్రిల్ 7 :

మన ఊరి ముచ్చట పత్రిక

మన ఊరి ముచ్చట పత్రిక నసుర్లాబాద్ ఏప్రిల్ 11 :