మన ఊరి ముచ్చట పత్రిక బాన్సువాడ ఏప్రిల్ 12

 99 రోజుల ప్రజా పాలనలో  ఆరోగ్య వారోత్సవాల ముగింపులో ముఖ్యఅతిథిగా హాజరైన పోచారం శ్రీనివాస్ రెడ్డి 
 ఏప్రిల్ 12  : 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం బాన్సువాడ మాత శిశు ఆసుపత్రిలో  వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో  నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల ముగింపులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ  శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు 
 ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు  బాపులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం  సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర రాజా నరసింహ  చేతుల మీదుగా  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  రూరల్ ఏరియా ఆసుపత్రులలో  బాన్సువాడ ఆసుపత్రి  అత్యధిక సాధరణ ప్రసవాలు  నిర్వహించిన ఆసుపత్రిగా  అవార్డు పొందడం పట్ల  వైద్య అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు
 ఈ సందర్భంగా  కామారెడ్డి జిల్లా డి సి హెచ్  ఆసుపత్రి,  బాన్సువాడ ఆసుపత్రి  సూపర్డెంట్ డాక్టర్ విజయభాస్కర్ కు, డిప్యూటీ డిఎంహెచ్వో  డాక్టర్ విద్యకు, ఆసుపత్రి వైద్యాధికారులకు, వైద్య సిబ్బందికి  శాలువాలతో ఘనంగా సన్మానించారు  అలాగే గర్భిణులకు బాలింతలకు  అందిస్తున్న సేవలపై  సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇంకా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను  అందించాలని  వైద్య అధికారులకు సిబ్బందికి ఆయన సూచించారు  ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు సిబ్బంది బాన్సువాడ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మన ఊరి ముచ్చట పత్రిక నసు ర్లాబాధ్ ఏప్రిల్ 7 :

మన ఊరి ముచ్చట పత్రిక

మన ఊరి ముచ్చట పత్రిక నసుర్లాబాద్ ఏప్రిల్ 11 :