మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూర్ ఏప్రిల్ 8 :

 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి  ఇసుక సరిపడా కొత్త విధానం 
       M  R  O సవాయిసింగ్ 
 ఏప్రిల్   8  :  బీర్కూరు మండలంలోని  
 పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు  ఇసుక కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ' మన ఇసుక వాహనం '  యాప్ ద్వారా  ఇసుక కావల్సిన లబ్ధిదారులు ఆన్లైన్లో  నమోదు చేసుకోవాలని బుధవారం బీర్కూర్ మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కుల గణన  సర్వే కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులకు జిపిఓ లకు ఆయన సూచించారు.  
 ఈ విధానంలో లబ్ధిదారులు యాప్ లో  నమోదు చేసుకున్న వెంటనే ఆ వివరాలు మొదట పంచాయతీ కార్యదర్శి వద్దకు చేరుతాయి. అనంతరం తాసిల్దార్ కు  వెళ్లిన అనంతరం  పరిశీలన చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. తాసిల్దార్ ఆ వివరాలను  యాప్ ద్వారా డౌన్లోడ్ చేసి అవసరమైన లబ్ధిదారుల  పేర్లను ధ్రువీకరించి  పూర్తి సంతకాలు చేసిన  తరువాత  పి ఆర్ కోడ్ లబ్ధిదారుల  జాబితా సిద్ధం అవుతుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక లబ్ధిదారుని  మొబైల్ కు ఓటిపి  పంపబడుతుందని అన్నారు  ఆ ఓటీపీ ఆధారంగా  మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయబడుతుందని పంచాయతీ కార్యదర్శులకు జిపిఓ లకు  స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల పర్యవేక్షణ అధికారి భాను ప్రకాష్ , ఎంపీ ఓ  మైభూబ్, పంచాయతీ కార్యదర్శులు.  జిపిఓలు  కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మన ఊరి ముచ్చట పత్రిక నసు ర్లాబాధ్ ఏప్రిల్ 7 :

మన ఊరి ముచ్చట పత్రిక

మన ఊరి ముచ్చట పత్రిక నసుర్లాబాద్ ఏప్రిల్ 11 :